జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కుటమి ప్రభుత్వం కృషి చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు రమేశ్, రంగస్వామి కోరారు. మంగళవారం పాణ్యం మండల కేంద్రంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించి వారు మాట్లాడారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలతో పాటు ప్రభుత్వం గృహలు నిర్మించి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఏకే. శ్రీనివాసులు, సుధాకర్, అప్సర్ బాషా, శ్రీనివాసులు, సుబ్బరాయుడు ఉన్నారు.