కేజీబీవీ మోడల్ స్కూల్ బీసీ హాస్టల్ ను తనిఖీ చేసిన తహసిల్దార్

81చూసినవారు
కేజీబీవీ మోడల్ స్కూల్ బీసీ హాస్టల్ ను తనిఖీ చేసిన తహసిల్దార్
నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు సూచనల మేరకు గడివేముల తహసీల్దార్ జమానుల్లా ఖాన్, డిప్యూటీ తాసిల్దార్ గురునాథం మండల కేంద్రం గడివేముల లోని కేజీబీవీ, మోడల్ స్కూల్, బీసీ హాస్టల్స్ ను సోమవారం నాడు తనిఖీ చేశారు. వసతి గృహాల పరిసరాలను పరిశీలించారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మెనూ తప్పక పాటించాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించాలని, ఆహారం నాణ్యత సరిగా ఉండాలనీ అన్నారు.

సంబంధిత పోస్ట్