వెల్దుర్తి మండలంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బుధవారం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం, జిల్లా కార్యదర్శి టి. కృష్ణ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇండ్ల స్థలం, గృహ నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులు, రైతు సంఘం పాల్గొన్నారు.