పత్తికొండ: బాధితులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి

82చూసినవారు
పత్తికొండ పట్టణంలోని రాజారెడ్డినగర్ బాధితులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కాంగ్రెస్ ఇన్చార్జి క్రాంతి నాయుడు కోరారు. శుక్రవారం పత్తికొండలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కాలనీ ఏర్పాటులో అక్రమాలపై లోకాయుక్తలో కేసు వేశారన్నారు. లోకాయుక్త ఆదేశాల మేరకు కలెక్టర్ కు పిర్యాదు చేయగా, తహసీల్దార్, హౌసింగ్ డీఈలతో కమిటీ ఏర్పాటు చేశారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రంగన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్