జోరుగా నాటు సారా తయారీ, ధ్వంసం చేసిన ఎస్ఐ
రుద్రవరం మండలంలోని హరినగరం సమీప నల్లమల అటవీ ప్రాంతంలో జోరుగా సాగిస్తున్న నాటు సారా తయారీ కేంద్రాలను ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించి నాటుసారా బట్టిలను ధ్వంసం చేసినట్లు రుద్రవరం ఎస్ఐ యు.వి వరప్రసాద్ తెలిపారు. హరి నగరం సమీపంలోని నల్లమల ప్రాంతంలో నాటుసార తయారు చేస్తున్నారని సమాచారం అందడంతో సిబ్బందితో దాడులు నిర్వహించామన్నారు. 10 డ్రమ్ముల్లో సిద్ధంగా ఉంచిన 1800 లీటర్ల నాటు సారా బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు.