మిర్చి రైతుకు నష్టాల ఘాటు.. ధరల పతనానికి కారణం ఏంటి?

57చూసినవారు
మిర్చి రైతుకు నష్టాల ఘాటు.. ధరల పతనానికి కారణం ఏంటి?
AP: ఈ ఏడాది మిర్చి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులకు ఎకరాకు సగటున రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు నష్టాలు వస్తున్నాయి. గతేడాది రూ.20 వేల వరకు పలికిన క్వింటాల్ మిర్చి ధర ఈ ఏడాది రూ.8 వేలకు నుంచి రూ.13 వేలకు మించడం లేదు. ఇప్పటికే కోల్డ్‌ స్టోరేజిల్లో గతేడాది పంట 15 లక్షల బస్తాలు నిల్వ ఉంది. ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. కొత్త పంటకు ఎగుమతులకు ఆర్డర్లు లేకపోవడంతో ధరల పతనం ప్రారంభమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్