విజయవాడ వరద బాధితుల సహాయార్థం సిఎం రిలీఫ్ ఫండ్ కు శ్రీశైలం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన రూ. 2,22,70,749 ల విరాళాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గురువారం అందజేశారు. విజయవాడ వాసులకు మేముసైతం అంటూ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పిలుపు మేరకు ముందుకు వచ్చి విరాళాలు అందించిన శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.