మహానంది ఇనాం భూములను ఆక్రమిస్తే శాఖాపరమైన చర్యలు

76చూసినవారు
మహానంది పుణ్యక్షేత్రానికి సంబంధించి ఇనాం భూములను ఆక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మహానంది దేవస్థానానికి సంబంధించిన ఇనాం భూములు కొందరు రైతులు పట్టాలుగా మార్చుకున్నారన్న సమాచారం మేరకు రెవెన్యూ కార్యాలయాలలో శాఖాపరమైన చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. దేవాలయ భూములను రక్షించడమే తమ లక్ష్యం అన్నారు.

సంబంధిత పోస్ట్