ఆత్మకూరులో దంచికొట్టిన వర్షం

67చూసినవారు
ఆత్మకూరు పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు కొంతమేర ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత నెలకొంది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మధ్యాహ్నం మూడు గంటల నుంచి దాదాపు గంట పాటు వర్షం దంచుకొట్టింది. దీంతో ఆత్మకూరు పట్టణంలోని లోతట్టు కాలనీలో వర్షపునీరు నిలిచి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. అలాగే పట్టణ శివార్లలోని భవనాసి నదిలో వర్షపు నీటి ప్రవాహం కొనసాగింది.

సంబంధిత పోస్ట్