మహానంది మండల పరిధిలోని నంద్యాల - గిద్దలూరు రహదారిలో గల నల్లమల ఘాట్ రోడ్డులోని ఇటుక దిమ్మెల సమీపంలో ఎక్స్ రోడ్డు మలుపు వద్ద సాంకేతిక లోపంతో లారీ ఆగిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గిద్దలూరు నుంచి నంద్యాలకు కర్రల లోడుతో వస్తున్న లారీ ప్రమాదవశాత్తు సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది. ఈ ఘటనతో ప్రకాశం- నంద్యాల జిల్లాలకు రాకపోకలు సాగించే వాహనాలకు మూడు గంటల పాటు తీవ్ర అంతరాయం కలిగింది.