
వెలుగోడు: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం వెలుగోడులోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు ఉన్నారు.