శ్రీశైలంలో లోక కల్యాణం కోసం దేవస్థానం స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ పల్లకి ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా (సర్కారి సేవగా) జరిపించబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పాన్ని పఠిస్తారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించారు.