ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న న్యూ ఉష టిఫిన్ సెంటర్ ముందు బాణ రూపదేవి, తన ముగ్గురు కుమార్తెలకు న్యాయం కావాలని ప్రజాసంఘాల నాయకులతో కలిసి గురువారం ధర్నా చేపట్టారు. రూపదేవి మాట్లాడారు. తన భర్త చనిపోయాడని, హోటల్ యజమాని శ్రీరాములు తనకు ఇవ్వాల్సిన పరిహారం డబ్బులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తూ, తన బిడ్డలకు అన్యాయం చేస్తున్నారన్నారు.