పెద్దకడబూరు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గల అన్ని గ్రామాలలో 14. 9. 2024 నుండి 30. 9. 2024 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారి శ్రీనివాస్ ఆచారి శనివారం తెలిపారు. ఇందులో భాగంగా రాజకీయ పార్టీలు ఇతర సంస్థలు ఎటువంటి ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, ధర్నాలు చేయరాదని, పోలీసు అనుమతి తీసుకోవాలని సూచించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.