చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుంగనూరులో భూవివాదం తెలెత్తడంతో స్థానికులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.