మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 17 మంది భక్తులు మరణించడంపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధకరమని, కష్ట సమయంలో భక్తులు సంయమనం, సహనం పాటించి శాంతియుతంగా తీర్థయాత్రను పూర్తి చేయాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. అలాగే దీని నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం అదనపు ఏర్పాట్లు చేయాలని కోరారు.