ఇకపై ప్రతి ఏటా ’ఆడుదాం ఆంధ్రా’ టోర్నీ

53చూసినవారు
ఇకపై ప్రతి ఏటా ’ఆడుదాం ఆంధ్రా’ టోర్నీ
ఏపీలో దాదాపు 50 రోజుల పాటు జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ టోర్నీ మంగళవారంతో ముగిసింది. విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఏలూరు-వైజాగ్ జట్ల ఫైనల్ మ్యాచ్‌ను జగన్ వీక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రతి ఏటా ‘ఆడుదాం ఆంధ్రా’ టోర్నీని నిర్వహిస్తామని ఈ సందర్భంగా జగన్ ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్