టీడీపీ ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది. ‘‘రోడ్డు పక్కన ఉన్న ఈ ఖరీదైన కారు ఎవరిదో కాదు
జగన్ తల్లి విజయమ్మది. ఇదంతా జరిగింది 2024 ఎన్నికల ముందు. ‘2019 ఎన్నికలకు బాబాయ్‌ను లేపేసినట్టే.. ఈ ఎన్నికలకు మరో పెద్ద తలకాయను
జగన్ టార్గెట్ చేస్తాడేమో’ అని ఏపీ ప్రజలు అనుకుంటున్న సమయంలో ఇది జరిగింది. తర్వాత ఏడాది ఆమె అమెరికాలోనే ఉన్నారు. లోగుట్టు ఆ కుటుంబానికే ఎరుక!’’ అని ట్వీట్ చేసింది.