ఇష్టమొచ్చినట్లు గ్యారంటీలు ప్రకటించొద్దు: ఎన్నికల హామీలపై ఖర్గే

76చూసినవారు
ఇష్టమొచ్చినట్లు గ్యారంటీలు ప్రకటించొద్దు: ఎన్నికల హామీలపై ఖర్గే
ఎన్నికల సమయంలో రాష్ట్రాల బడ్జెట్‌ను పరిగణలోకి తీసుకోకుండా హామీలను ప్రకటించవద్దని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల కాంగ్రెస్‌ చీఫ్‌లకు సూచనలు చేశారు. బడ్జెట్‌ ఆధారంగా గ్యారంటీలు ప్రకటించాలన్నారు. కాగా కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు సేవలను అందించే శక్తి పథకాన్ని సమీక్షిస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్