సంక్రాంతి సందర్భంగా మంత్రి లోకేష్ తన సతీమణి బ్రాహ్మణికి ఇచ్చిన బహుమతి మంగళగిరి వాసుల ఆనందానికి కారణమైంది. మంగళగిరి చేనేత చీరను సంక్రాంతి స్పెషల్ గిఫ్ట్‌గా ఇచ్చి ఆమెను ఆశ్చర్యానికి గురి చేశారు. బ్రాహ్మిణి నేడు ఆ చీరను కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమపై లోకేష్, ఆయన కుటుంబం చూపుతున్న అభిమానానికి మంగళగిరి చేనేతలు మురిసిపోతున్నారు.