వైభవంగా శ్రీవారి ముత్యపుపందిరి వాహన సేవ

79చూసినవారు
వైభవంగా శ్రీవారి ముత్యపుపందిరి వాహన సేవ
AP: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్