AP: వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా వంగవీటి రాధాపై వైసీపీ నేత పోతిన మహేష్ విమర్శలు చేశారు. వంగవీటి రంగా ఆశయాలను తీసుకెళ్లాల్సిన వ్యక్తులు.. కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారన్నారు. కాపు రిజర్వేషన్ల పైన రాధా ఒక్క మాట మాట్లాడలేదన్నారు. విగ్రహావిష్కరణలు చేస్తూ నేనే వారసుడని రాధా చెప్పుకుంటున్నారు కానీ.. రంగా ఆశయాల కోసం రాధా ఎక్కడా నిలబడనిలేదని పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.