డాక్యుమెంట్లు స్కానింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు వాట్సప్ కొత్త డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో నేరుగా వాట్సప్‌లోనే డాక్యుమెంట్లను స్కాన్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఎంపిక చేసిన లేటెస్ట్ వెర్షన్ యాపిల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. డాక్యుమెంట్ షేరింగ్ మెనూలో కొత్తగా ఈ "స్కాన్" ఆప్షన్ కనిపించనుంది. దీని సాయంతో కావాల్సిన డాక్యుమెంట్లను ఫోన్‌లోని కెమెరాతో చిటికెలో స్కాన్ చేయొచ్చు.