కరోనా సమయంలో రూ.కోట్లలో దానం చేసి తాను రీల్ హీరో కాదు రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పలు పొలిటికల్ పార్టీలు నన్ను పిలిచి సీఎం పదవీని, డిప్యూటీ సీఎం పదవీని ఆఫర్ చేశాయి. అయితే నేను వాటన్నింటికి నో చెప్పాను.’ రాజకీయాల్లో చేరి ఎవరికో జవాబుదారీగా ఉండాల్సిన అవసరం నాకు లేదు అని సోనూసూద్ స్పష్టం చేశారు.