AP: ఏపీ రైతులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుభవార్త చెప్పారు. వ్యవసాయ పంప్ సెట్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించబోమని చెప్పారు. గతంలో జగన్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లతో రైతులకు ఉరితాడు వేసేందుకు చూసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలిగించే చర్యలు తీసుకోదన్నారు. అటు వ్యవసాయానికి ఇస్తున్న 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాలో ఎటువంటి మార్పు లేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు.