AP: కూటమి ప్రభుత్వం ఉచిత వంటగ్యాస్ లబ్ధిదారుల అకౌంట్లోకి ప్రతి ఏడాది రూ.2,550 ఇచ్చేందుకు సిద్ధపడింది. అయితే ఇక్కడో కండీషన్ ఉంది. వారు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లకు బదులుగా.. పైప్‌లతో సరఫరా అయ్యే వంట గ్యాస్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంది. మరి పైప్‌లతో వంటగ్యాస్ సప్లై చేస్తే.. ఉచితంగా గ్యాస్ ఇస్తారా? అనే దానిపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. పైప్ గ్యాస్ తీసుకున్న వారికి కూడా ఉచిత వంట గ్యాస్ స్కీమ్ వర్తిస్తుందన్నారు.