AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సీఎం చంద్రబాబు దావోస్‌కు ఎందుకు తీసుకెళ్లలేదంటూ ప్రశ్నించిన మాజీ మంత్రి రోజాపై మంత్రి కందుల దుర్గేశ్ మండిపడ్డారు. క్యాబినెట్ మొత్తాన్ని ఎవరూ దావోస్ తీసుకెళ్లరని అన్నారు. పవన్ గురించి మాట్లాడే హక్కు రోజాకు లేదన్నారు. ఐదేళ్ల పాటు మంత్రిగా ఈ రాష్ట్రానికి ఆమె ఏం చేశారని ప్రశ్నించారు. రిషికొండపై జగన్ భవనాలు కడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు.