మద్యం దుకాణాల కేటాయింపులో అవకతవకలకు తావివ్వొద్దు: మంత్రి కొల్లు

585చూసినవారు
మద్యం దుకాణాల కేటాయింపులో అవకతవకలకు తావివ్వొద్దు: మంత్రి కొల్లు
ఏపీలో మద్యం షాప్‌ల దరఖాస్తు ప్రక్రియ, నూతన ఎక్సైజ్‌ పాలసీపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షాసమావేశం నిర్వహించారు. మద్యం దుకాణాల కేటాయింపులో అవకతవకలకు తావివ్వొద్దని అధికారులకు ఆదేశించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా షాపులు కేటాయించాలని సూచించారు. సిండికేట్లకు సహకరించే వారిని ఉపేక్షింబోమని తేల్చి చెప్పారు. దరఖాస్తు కోసం వచ్చే వారికి అధికారులు సహకరించాలని కోరారు. ఈనెల 16 నాటికి కొత్త షాపులు తెరవాలని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్