AP: దావోస్‌లోనూ రెడ్ బుక్ గురించి మాట్లాడారంటూ మాజీ మంత్రి రోజా చేసిన విమర్శలకు.. మంత్రి లోకేష్ కౌంటరిచ్చారు. జ్యూరిక్‌లో తాము దిగిన రోజున అక్కడున్నవారు చంద్రబాబును కలవాలని కోరినట్లు లోకేష్ చెప్పారు. దీంతో జ్యూరిక్‌లో 700 మందితో మీటింగ్ పెట్టామని.. అక్కడ ఓ వ్యక్తి రెడ్ బుక్ గురించి మాట్లాడాలని కోరినప్పుడు తాను రెడ్ బుక్ గురించి మాట్లాడినట్లు క్లారిటీ ఇచ్చారు. రోజాకు దావోస్‌కు, జ్యూరిక్‌కు తేడా తెలియదంటూ మంత్రి లోకేష్ సెటైర్లు వేశారు.