ఏటీఎం కేంద్రంలోనే ఓ యువకుడు మూత్ర విసర్జన చేశాడు. పంజాగుట్టలోని రాజ్‌భవన్ రోడ్డులో ఆర్‌బీఎల్ బ్యాంక్ ఏటీఎం ఉంది. అందులో డబ్బులు డ్రా చేసేందుకు యువకుడు వచ్చాడు. డబ్బులు డ్రా చేసిన తర్వాత డబ్బులు వచ్చే చోట అతను మూత్ర విసర్జన చేశాడు. దీంతో సెన్సార్ పాడయ్యింది. మేనేజర్ సీసీ కెమెరాలు పరిశీలించగా ఈ విషయం బయటికి వచ్చింది. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.