సామాజిక న్యాయం కోసం పరితపించిన మహనీయుడు ఎన్టీఆర్‌: సీఎం

53చూసినవారు
సామాజిక న్యాయం కోసం పరితపించిన మహనీయుడు ఎన్టీఆర్‌: సీఎం
AP: సీఎం చంద్రబాబు సామాజిక న్యాయం కోసం పరితపించిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని అన్నారు. "పేదల కోసం శాశ్వత గృహనివాస పథకం తీసుకొచ్చిన మొదటి వ్యక్తి ఆయన. ఎస్సీల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతుండటం బాధాకరం. కులాల అంటరానితనం నిషేధానికి జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ను నేనే వేశా. అంటరానితనం రూపుమాపడానికి ఎన్నో జీవోలు జారీ చేశాం. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఏర్పాటు చేశాం" అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్