AP: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో డీఎస్సీ ఉచిత శిక్షణ తరగతులను మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ ప్రారంభించారు. 650 మందికిపైగా యువతకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనలో ఏపీ ఆర్థికంగా కుప్పకూలిందని నీతి ఆయోగ్ వెల్లడించినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్‌పైనే సీఎం తొలి సంతకం చేశారని గుర్తు చేశారు.