నెల్లూరు కార్పొరేషన్‌గా ఏర్పడిన తర్వాత తొలి మేయర్ కాంగ్రెస్ పార్టీనుంచి గెలిచారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2014లో మేయర్ పీఠం వైసీపీకి దక్కింది.అయితే రోజుల వ్యవధిలోనే అజీజ్ ప్లేట్ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మరోసారి మేయర్ పీఠం దక్కించుకుంది. మేయర్‌గా గిరిజన మహిళ స్రవంతికి అవకాశం లభించింది. అయినా కూడా వైసీపీని దురదృష్టం వెంటాడింది. ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్ పై టీడీపీ డామినేషన్ పూర్తి స్థాయిలో కనపడుతోంది.