నేడు ఈ జిల్లాల్లో మోస్త‌రు వ‌ర్షాలు

69చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో మోస్త‌రు వ‌ర్షాలు
AP: మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు జిల్లాల్లో నేడు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్ల‌డించారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయ‌ని తెలిపారు.

సంబంధిత పోస్ట్