బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి ఎంపీ శబరి సవాల్

52చూసినవారు
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి ఎంపీ శబరి సవాల్
AP: నంద్యాల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని ఎంపీ శబరి టార్గెట్ చేశారు. బైరెడ్డి అంటే తానేనని, సిద్దార్థ్ రెడ్డి కాదని పేర్కొన్నారు. కేసులు, అరెస్టుల గురించి సిద్దార్థ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. తన తల్లిపైన వ్యక్తిగత విమర్శలు చేశారని ఎంపీ శబరి మండిపడ్డారు. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి బయటికి వస్తుందని, శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎవరేం అభివృద్ధి చేశారో చర్చించడానికి తాను సిద్ధమని సిద్దార్థ్ రెడ్డికి సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్