నేడు, రేపు ఈ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు

63చూసినవారు
నేడు, రేపు ఈ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు
AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలోని 11, విజయనగరంలోని 16, మన్యం జిల్లాలోని 13, అల్లూరి జిల్లాలో 3, కాకినాడ 1, తూ.గో జిల్లాలోని 1 మండలంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలోని 34 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, మిగతా జిల్లాల్లోని 171 మండలాల్లో మోస్తరు వడగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్