హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ

53చూసినవారు
హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ
టాలీవుడ్ హీరో హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ జరిగింది. HYD ఫిలింనగర్‌ రోడ్డునెంబర్‌–8లోని ఓ ఇంట్లో నివసిస్తున్న ఆమె తెల్లవారి తన గదిలో వస్తువులు చిందరవందరగా పడి ఉండడం చూసి పరిశీలించగా రెండు బంగారు డైమండ్‌ ఉంగరాలతో పాటు ఒక హెడ్‌ఫోన్‌ కనిపించలేదు. దీంతో ఆమె తండ్రి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్‌ టీంతో వేలిముద్రలు సేకరించారు. గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చినట్లు గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్