AP: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ‘కోటరీ’ అనే అంశంపై ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా.. ఆ కోటరీ మాత్రం ఆహా రాజా, ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్లకు గంతలు కట్టి ఆటలు సాగించుకునేది. దాని వల్ల రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటలో రాజు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి.’ అని అన్నారు.