ఈడీ విచారణకు హాజరైన ఎంపీ విజయసాయిరెడ్డి

58చూసినవారు
ఈడీ విచారణకు హాజరైన ఎంపీ విజయసాయిరెడ్డి
AP: కాకినాడ సీ పోర్టు, సెజ్ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఆయన బహీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. కాకినాడ సీ పోర్టు, సెజ్‌కు సంబంధించి అక్రమంగా షేర్లు బదలాయింపు చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీలో కేసు నమోదైైంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్