కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకుంది. ఇద్దరు పోలీసు అధికారులపై కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు సస్పెన్షన్ వేటు వేశారు. నందికొట్కూరు రూరల్ సీఐ విజయ్ భాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్‌ను సస్పెండ్ చేశారు.