AP: మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ కార్యకర్తల ఫోన్‌నెంబర్లు కలెక్ట్ చేస్తున్నారని.. జిల్లా ఎస్పీ కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరుగుతోందని పేర్ని నాని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌లకు తాను భయపడనని.. ఏం చేస్తారో చేసుకోండని మాజీ మంత్రి సవాల్ చేశారు.