ఏపీ అసెంబ్లీలో జనసేన డిప్యూటీ ఫోర్ల్ లీడర్‌గా మంత్రి నాదెండ్ల మనోహర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమాచారం అందించారు. ఇక పార్టీ చీఫ్ విప్‌గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులివర్తి రామాంజనేయులు, కార్యదర్శులుగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణా, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్లను నియమించారు.