ఫిట్‌నెస్‌లేని బస్సులపై చర్యలు తీసుకోవాలి
By W. Abdul 77చూసినవారుప్రైవేట్ పాఠశాలల ఫిట్నెస్ లేని స్కూలు బస్సుల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు గౌస్, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదోని ఆర్టిఓ శిరీష దీప్తికు వినతి పత్రం అందజేశారు. సరైన ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చలగాటమాడుతున్నారన్నారు. స్కూలు బస్సుకు డ్రైవర్‌తోపాటు క్లీనర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు.