ఆదోని పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే 50 పడకల తల్లి, పిల్లల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయాలని విజయవాడలో డైరెక్టర్ ఫర్ సెకండరీ హెల్త్ ను కోరినట్లు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తెలిపారు. బుధవారం విజయవాడలో మాట్లాడారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి ధీటుగా ఆదోని డివిజన్ లోని 250 కిలోమీటర్ల పరిధిలో వైద్యసేవలు అందించే ఆదోని తల్లి, పిల్లల ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్ గా చేయాలని కోరినట్లు తెలిపారు.