కర్నూలు జిల్లాలో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్వాగతించారు. కర్నూలు జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల నేడు నెరవేరుతోందని అన్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు ద్వారా ప్రజలకు న్యాయపరంగా ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు.