ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆదోని పట్టణంలో ప్రవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు సంక్రాంతి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే అడ్డుకుంటామని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ ఉపాధ్యక్షుడు నాగరాజు సోమవారం తెలిపారు. ఆదోనిలో కొన్ని విద్యాసంస్థలు విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. అధికారులు నిఘా ఉంచి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు.