భూమా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎద్దుల పాపమ్మ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం గత వారం రోజులుగా నిర్వహించిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారంతో ముగిసింది. నంద్యాల జట్టు నిర్ణీత 6 ఓవర్లలో 76 పరుగులు చేసి విజయం సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఏ మోహన్ గారు పీఆర్ఓ ప్రసాద్, గూబగుండం ప్రెసిడెంట్ ఉపేంద్ర, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు బహుమతులను ప్రదానం చేశారు.