టిడ్కో గృహాల వద్ద పోలీసు కవాతు నిర్వహించిన ఎస్సై నగీన

567చూసినవారు
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో గల టిడ్కో గృహ సముదాయాల వద్ద సోమవారం రాత్రి ఎస్సై నగీన బిఎస్ఎఫ్ దళాలతో కలిసి పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు బ్లాక్ ల వద్దకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎవరైనా అనుమానాస్పదంగా కనపడితే పోలీసు వారికి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో బిఎస్ఎఫ్ దళాలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్