మహిళలు, విద్యార్థలు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ కోసం డయల్ 100, 112, 1098, కాల్ చేసి సమాచారం అందించాలని ఆలూరు ఎస్సై దిలీప్ కుమార్ అన్నారు. శనివారం ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో ఆలూరు బాలికల ఉన్నత పాఠశాలలో మహిళలపై జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పించారు. ఈవీజింగ్, రోడ్డు భద్రత, సైబర్ మోసాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే 1930కి వెంటనే సమాచారం అందించాలన్నారు.