అధికారం లేనప్పుడు ముందుండి నడిపించేవాడే నిజమైన నాయకుడని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అన్నారు. ఆదివారం ఆస్పరి మండలంలోని చిన్నహొత్తూర్ గ్రామానికి చెందిన బసవరాజు వైకాపా ఆస్పరి మండల కన్వీనర్ గా ఎన్నికయ్యారు. ఆస్పరి మండలం వైసీపీ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై ప్రజల తరుపున పోరాటాలు చేస్తామన్నారు. పలువురు నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, యువ నాయకులు పాల్గొన్నారు.